Listen to this article

జనం న్యూస్ నవంబర్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం కేంద్రంలోని తుడుం వెంకటేష్ మాదిగ అధ్యక్షతన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ముక్కెర ముఖేష్ మాదిగ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పూలమాల వేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచించడం వలన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల ప్రజలకు అగ్రకులాల అగ్రవర్ణ పేద వర్గాలకు స్వేచ్ఛ సమానత్వం సౌబ్రతత్వం లభించింది అని అన్నారు సమాజంలోని ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఫలాల ఆధారంగానే ప్రజాప్రతినిధులు, ఉద్యోగాలలో నియమాకాలాల్లో ప్రమోషన్లు రావడం జరుగుతుంది.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం స్త్రీలకు పురుషులకు సమాన అవకాశాలు కల్పించాలని సమాన హక్కులు ఉండాలని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రతి దేశానికి ఆదర్శం ప్రతి మనిషికి భారత రాజ్యాంగం వలనే స్వేచ్ఛమైన గౌరవం వచ్చింది.. ఎస్సీ ఎస్టి బిసి మైనార్టీ వర్గాలకు సామాజిక న్యాయం ఆర్థిక న్యాయం జరిగింది భారత రాజ్యాంగం వలన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రతి పేదవాడికి విద్య అందించాలి పట్టుదలతో భారత రాజ్యాంగం రచించారు అని తెలిపారు ఈ కార్యక్రమంలో అరికెల దేవయ్య మాదిగ ఎంఎస్పి జిల్లా నాయకులు.తుడుం వెంకటేష్ మాదిగ ఎమ్మార్పీఎస్ శాయంపేటమండల అధ్యక్షుడు.
మరపల్లి చిరంజీవి ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి…విజయ్ మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు.తిరుపతి రెడ్డి మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకులు షాంపేట్ మండలం.వంశీ కిరణ్ చందు దేవేందర్ తదితరులు పాల్గొన్నారు