Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.బుధవారం 24 11 2025

నాడు రాజంపేట సబ్ కలెక్టర్ ఏ ఎస్ భావన ఐఏఎస్ నందలూరు మండలంలోని అడపూరు గ్రామంలోని జరుగుతున్న రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సందర్శించడం జరిగింది. రైతన్న మీకోసం కార్యక్రమము జరుగుతున్న తీరును పరిశీలించడం జరిగింది. రైతులతో ముఖాముఖిగా మాట్లాడుతూ రైతన్న మీకోసం యొక్క ఉద్దేశాలను రైతులకు తెలియజేయడం జరిగింది.రాజంపేట సబ్ కలెక్టర్ భావన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తెలియజేసిన ఐదు ప్రధాన సూత్రాలను నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు ,అగ్రిటెక్ ,ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వం అందిస్తున్న సహాయం ల గురించిరైతులకువివరించడం జరిగినది అదేవిధంగా రైతులు ఏ ఏ పంటలు సాగు చేస్తున్నారు దాంట్లోఎలాంటి మద్దతు ధర లభిస్తుంది అన్ని విషయాల గురించి రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ మండల వ్యవసాయ అధికారి మల్లికార్జున మార్కెట్ యార్డ్ డైరెక్టర్ సుబ్బయ్య , సచివాలయం సిబ్బంది, వీఆర్వో మరియు రైతులు, టీడీపీ నాయకులు పాల్గొనడం జరిగినది.