Listen to this article

జనం న్యూస్, నవంబర్ 26, జగిత్యాల జిల్లా మెట్ పల్లి:

పట్టణంలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి ఆకుల హన్మాండ్లు మరియు జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగే రజిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగర ముగిందని బీసీ ప్రజలు మేల్కొనవాల్సిందిగా పిలుపునిస్తున్నామన్నారు.42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కి బీసీలకు కేవలం 17%తో సరిపెట్టుకోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ప్రజల గమనించాల్సిన విషయమేమిటంటే జనరల్ రిజర్వేషన్లలో బీసీలు ఎస్సీ, ఎస్టీ,మైనారిటీలతో కలిసి ఐక్యంగా పోరాడి ఆధిపత్యం సాధించే దిశగా అడుగులు వేయాలని అన్నారు. ఈ ఎన్నికలు రెడ్డిలు,రావులతో బీసీలకు మధ్య పోరాటంగా అభివర్ణించారు. గ్రామాలలో యువత మేల్కొని ఎన్నికలలో పాలుపంచుకోవాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు తీన్మార్ మల్లన్న పిలుపునిచ్చారని అన్నారు. గ్రామాలలో ఏ సమస్య వచ్చిన తెలంగాణ రాజ్యాధికార పార్టీని సంప్రదించాలని కోరారు.ఫోన్ నెంబర్లు 7013068315 (ఆకుల హన్మాండ్లు ), 7036013194(జోరిగే రజిత ).ఏ సమస్యకైనా సంప్రదించాలంటూ తీన్మార్ మల్లన్న తెలిపారన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భీమన్న,మైనారిటీ పట్టణ అధ్యక్షులు అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.