జనం న్యూస్ ప్రతినిధిఆలంపల్లి దుర్గేష్ 9640204826
(చింతపల్లిగూడ, నవంబర్ 27):ఇబ్రహీంపట్నం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి స్థానిక ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి తోనే సాధ్యమవుతుందని, సబ్బండ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో ఎమ్మెల్యే అహర్నిశలు కృషి చేస్తున్నారని దళిత చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఉక్కుల అశోక్ కొనియాడారు. గురువారం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆదిభట్ల మున్సిపాలిటీ 3వ వార్డు చింతపల్లిగూడ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు కొబ్బరికాయ కొట్టి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు జోగు శేఖర్, కొండ్రు రాములు, జోగు బాలయ్య, జోగు నర్సింహ, జోగు యాదయ్య, జోగు జంగయ్య, జోగు మహేందర్, జోగు భాస్కర్‌తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.


