Listen to this article

పయనించే సూర్యుడు నవంబర్ 27 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )

సూళ్లూరుపేట మండలం మంగా నెల్లూరు గ్రామంలో ఎర్ర బత్తిన క్రిష్ణయ్య అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పీఎం జేజే బి వై యాక్టివ్ లో ఉన్నది. పీఎం జే జే బి వై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ settlement అయ్యింది. పీఎంజేజేబివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య నామినీ లలితమ్మ కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ వి. వినోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ PMJJBY మరియు PMSBY అందరూ చేసుకోవాలని భవిష్యత్తులో జరిగే అకాల సంఘటనలకు మీ కుటుంబాలకి చేయూత కలిగే విధంగా భరోసా కల్పిస్తుంది అని తెలియ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ సాయి వాసవి సూళ్లూరుపేట వెలుగు సీసీ క్రిష్ణయ్య సూళ్లూరుపేట ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్స్ ముని చంద్ర, పరమానందం పాల్గొనడం జగిరింది.