బిచ్కుంద నవంబర్ 28 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం నమస్తే తెలంగాణ పేపర్ ప్రతినిధి దుబ్బ నాగరాజు గారి మాతృమూర్తి గడచిన వారం ఆరోగ్యం బాగోలేక పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ MLA హన్మంత్ షిండే గారు వారి నివాసానికి వెళ్లి దుబ్బ నాగరాజు గారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి ధైర్యం చెబుతూ వారి దుఃఖంలో తాము కూడా భాగస్వాములమని భావోద్వేగంతో తెలిపారు.ఇదే సమయంలో బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని డాక్టర్ ప్రభాకర్ కుమారుడు, కోడలు బైక్పై నుండి పడి జరిగిన దుర్ఘటనలో డాక్టర్ కోడలు సోమవారం రోజున అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనపై విచారం వ్యక్తం చేసిన హన్మంత్ షిండే గారు, శుక్రవారం రోజు డాక్టర్ ప్రభాకర్ గారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో మండల BRS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు



