జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ దీపక్ తివారి
జనం న్యూస్. కొమురం భీమ్ జిల్లా. డిస్టక్ట్ స్టాఫ్ఫర్.నవంబర్ 28, 2025:
2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) దీపక్ తివారి అన్నారు. శుక్రవారం జిల్లాలోని కెరమెరి, జైనూరు, సిర్పూర్(యు), లింగాపూర్ మండలాలను సందర్శించి, సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో మాట్లాడుతూ నామినేషన్ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. నామినేషన్ పత్రాల ధృవీకరణ, అభ్యర్థుల వివరాల నమోదు, అవసరమైన రికార్డుల నిర్వహణ అంశాలను పకడ్బందీగా నిర్వహించాలని, అభ్యర్థులు, ప్రతినిధులు, ప్రజల రాకపోకలు సజావుగా ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఖచ్చితంగా అమలు చేయాలని, నామినేషన్ కేంద్రాల వద్ద అనవసర గుంపులు, ప్రచారాలు, పోస్టర్లు, బ్యానర్లు లేకుండా చూడాలని, పోలీస్ శాఖతో కలిసి సమన్వయం చేసుకుంటూ అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ సమయంలో ఏ విధమైన చట్టవిరుద్ధ చర్యలు, అడ్డంకులు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతల విషయంలో సున్నితమైన గ్రామాలు/వార్డులను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నామినేషన్ ప్రక్రియలో ప్రతి దశను అత్యంత జాగ్రత్తగా పర్యవేక్షించాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణలో ఎన్నికల కమిషన్ జారీ చేసిన నియమాలకు లోబడి వ్యవహరించాలని, నామినేషన్ పత్రాల స్వీకరణ, నామినేషన్ల పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా వచ్చిన దరఖాస్తులను మాత్రమే స్వీకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారిచే జారీ చేయడమైనది



