జన న్యూస్ నవంబర్ 27 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోసం జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం స్థానిక ఎమ్మెల్యే దాట్ల బుచ్చి రాజు అధ్యక్షతన రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్, వీక్ బూత్ ఇంచార్జ్ కంకటాల రామం పర్యవేక్షణలో వీక్ బూత్ లు గా ఉన్న బూత్ వ్యవస్థను పటిష్ట కొరకు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వీక్ బూత్ ఇంచార్జ్ అయిన రామం, వీక్ బూత్ యొక్క ప్రతి బూత్ ఇన్చార్జిలతో కలిసి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని దానికి కావలసిన సలహాలు, సూచనలు అందించడానికి పార్టీ ఆదేశాలతో మీ వద్దకు రావడం జరిగిందని తెలియపరిచారు. ఈ సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, మండల పార్టీ అధ్యక్షులు క్లస్టర్ ఇంచార్జీలు.బూత్ ఇంచార్జ్లుయూనిట్ ఇన్చార్జిలు గ్రామ కమిటీ అధ్యక్షులు, కోనసీమ జిల్లా వాణిజ్య విభాగ ఉపాధ్యక్షుడు జంపన సుమన్ వర్మ పాల్గొనడం జరిగింది.



