జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేగుంట
డిసెంబర్ 01,
చేగుంట ఎంపీడీవో కార్యాలయంలో కార్యాలయంలో నామినేషన్ కేంద్రాలను ఆకస్మికంగా పరిశీలించన జిల్లా కలెక్టర్ రావుల్ రాజ్, అనంతరం మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ, రికార్డు నమోదు, సాంకేతిక సౌకర్యాలు, అభ్యర్థుల సౌకర్యాల ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా రిజిస్టర్ లో నామినేషన్ నమోదులు తేది, సమయం, క్రమ సంఖ్యను పరిశీలించారు. రెండో విడతకు మంగళవారం నామినేషన్ దాఖలు కోసం చివరి రోజుకావడంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని రిటర్నింగ్ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.అభ్యర్థుల వివరాలను తక్షణమే టి పోల్ లో అప్లోడ్ చేయాలని, అప్లోడ్ ప్రక్రియలో ఎటువంటి అంతరాయం లేకుండా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో ప్రతీ దశను బాధ్యతతో, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను, సిబ్బందిని ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో చిన్నరెడ్డి, తాసిల్దార్ శివప్రసాద్, ఎస్ ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీవో ప్రశాంత్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


