జనం న్యూస్ – డిసెంబర్ 1- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
జర్నలిస్టుల సమస్యలపై డిసెంబర్ 3వ తేదీన హైదరాబాదులోని సమాచార శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే మహా ధర్నా కు జర్నలిస్టులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని టియుడబ్ల్యూజే నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి దాసిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త అక్రిడేషన్ కార్డులు, ఆరోగ్య బీమా, ఇంటి స్థలాలు తదితర సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన జర్నలిస్టుల సమస్యలు తీర్చలేదని అన్నారు, ఇప్పటికైనా ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. డిసెంబర్ 3వ తేదీన జరిగే మహా ధర్నాకు జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ తరలివచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పాకాల నరసింహ, ప్రకాష్, రవి, రాజు, అప్పారావు, శ్యామ్, గోరంట్ల శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


