

జనం న్యూస్ ప్రతినిధి
మధిర మండలంలోని మాటూరు ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఈ రోజు పట్టణంలోని హై కేర్ హాస్పిటల్ ప్రముఖ వైద్యులు జంగా నవీన్ రెడ్డి నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డి విద్యార్థినీ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుపల్లి శ్రీహరి తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుచెరుపల్లి శ్రీహరి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మధిర మండల విద్యాశాఖ అధికారి వై ప్రభాకర్ మాట్లాడుతూ ప్రైవేటు యాజమాన్యం అయినప్పటికీ మధిర హై కేర్ హాస్పిటల్స్ సిబ్బంది సేవా దృక్పథంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందించడం చాలా గొప్ప విషయంగా పేర్కొన్నారు. మాటూరు ఉన్నత పాఠశాలలో ఉన్న 130 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి వారి బ్లడ్ గ్రూపులు, హెమోగ్లోబిన్ శాతం తెలుపడంతో పాటు ఆ లోపాల సవరణకు కావలసిన మందులు ఉచితంగా అందించిన హై కేర్ హాస్పిటల్ డాక్టర్ జంగా నవీన్ రెడ్డికి నిర్వాహకులు ప్రవీణ్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.అనంతరం డాక్టర్ జంగా నవీన్ రెడ్డి మాట్లాడుతూ తన ప్రాథమిక విద్య కూడా ప్రభుత్వ పాఠశాలలోనే జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుందని, ఎటువంటి ఒత్తిడి లేకుండా సుశిక్షితులైన ఉపాధ్యాయుల సహకారంతో చక్కని విద్యను నేర్చుకోవాల్సిందిగా సూచిస్తూ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయ బృందం డాక్టర్ జంగా నవీన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి లను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దీవి సాయి కృష్ణమాచార్యులు, సంక్రాంతి శ్రీనివాసరావు , కొలగాని ప్రసాదరావు, మేడేపల్లి శ్రీనివాసరావు, చౌడవరపు సునీత, రెంటపల్లి భాగ్య శ్రీనివాసరావు, షేక్ ఇబ్రహీం , బొగ్గుల శ్రీనివాసరెడ్డి, ఎం వర ప్రసాద్, పగిడిపల్లి ఇస్సాక్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.