జనం న్యూస్ 03డిసెంబర్ పెగడపల్లి
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం లో బుధవారం 03 12 2025నుండి తేదీ 5 12 2025 శుక్రవారం వరకు కలదు. పెగడపల్లి మండల పరిధిలోని( 23) గ్రామ పంచాయతీలకు గాను (8) క్లస్టర్ గ్రామపంచాయతీలలో నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగినది. ఈరోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్లకు సంబంధించిన సామాగ్రిని సరఫరా చేయడం జరిగింది. ఈరోజు ఉదయం ఉదయం 10:30కు మండలస్థాయి అన్నిరాజకీయ పార్టీ నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నామినేషన్ల పైన ఉన్న సందేహాలను నివృత్తి చేయడం జరిగింది మరియు మధ్యాహ్నం 2.00 గంటలకు ఆర్ ఓ/ఏ ఆర్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి తదనంతరం ఎన్నికల సామాగ్రిని సరఫరా చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఎమ్ పి డి ఓ ప్రేమ్ సాగర్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.


