జనం న్యూస్ డిసెంబర్(2) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం
అర్వపల్లి మండలంలో మంగళవారం నాడు ఇసుక ట్రాక్టర్ అతివేగంతో,నిర్లక్ష్యంగా నడిపి బైకును వెనకనుంచి డీ కొట్టడం తో బైక్ పై వెళుతున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అరవపల్లి గ్రామానికి చెందిన గద్దగుటి మల్లయ్య తన సోదరుని కుమారుడి పుట్టినరోజు వేడుకలకు ఇంటి నుంచి సూర్యాపేట వైపు ఫంక్షన్ హాలుకు వెళుతుండగా అదే సమయంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఇసుక ట్రాక్టర్ వెనుక నుంచి ఢీకొని మృతుని పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. కొద్దిసేపటి క్రితం వరకు తమతో కలిసి తిరిగిన వ్యక్తి మృతి చెందాడని విషయాన్ని తెలుసుకున్న బంధువులు కుటుంబీకుల రోధనలు మిన్నంటాయి. అనంతరం బంధువులు మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని మృతదేహంతో జనగం సూర్యాపేట రహదారిపై రాస్తరోకో నిర్వహించారు.ఈ విషయాన్ని తెలుసుకున్న నాగారం సిఐ నాగేశ్వరరావు మృతుని బంధువులతో మాట్లాడి రాస్తారోకో విరమింప చేశారు.మృతిని భార్య మమత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదులు తెలిపారు.


