Listen to this article

జనం న్యూస్ 03 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ తాలూకా ఐజ మండలం. భరత్ నగర్ కాలనీలో 6 నెలలుగా డ్రైనేజీ సమస్య అలాగే, ప్రజలను పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం అయిజ: భారతీయ జనతా పార్టీ అయిజ పట్టణ అధ్యక్షులు కంపాటి భగత్ రెడ్డి* ఆధ్వర్యంలో, ఈరోజు భరత్ నగర్ కాలనీని నాయకులతో కలిసి సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా *జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు ఎస్ రామచంద్రారెడ్డి* పాల్గొని, వారు మాట్లాడుతూ,జోగులాంబ గద్వాల మునిసిపాలిటీ పరిధిలోని భరత్ నగర్ కాలనీలో గత 6 నెలలుగా డ్రైనేజీ శుభ్రం చేయకపోవడం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. డ్రైనేజీ మూసుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి, డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు విస్తరిస్తున్నాయి. ప్రజల ఆరోగ్యంపై తీవ్రప్రభావం పడుతున్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మునిసిపాలిటీ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తుంది.తెలంగాణ రాష్ట్రంలో ఆదాయ వసూళ్లలో అయిజ మునిసిపాలిటీ రెండో స్థానంలో ఉన్నా, పనుల విషయంలో మాత్రం చివరిస్థానంలో ఉండడం దురదృష్టకరం. ఇంత ఆదాయం వచ్చినా ప్రజల సమస్యలను పరిష్కరించకపోవడం పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం.స్థానికంగా ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం, , అలాగే యంయల్ ఎ యం యల్ సి కాంగ్రెస్ ఇంచార్జ్, నాయకులు, రాజకీయ కక్షసాధించడమే తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదు. ప్రజలు తమకు ఓటు వేయలేదనే కారణంతో కక్షపూరితంగా ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే చర్య.“ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు. అవినీతి, అక్రమాలు, నిర్లక్ష్యమే కాంగ్రెస్ ప్రభుత్వ రూల్‌బుక్ అయ్యింది. ప్రజల ఆరోగ్యం, భద్రత వంటి ప్రాథమిక అంశాలను కూడా గాలికి వదిలేశారని” తీవ్రంగా విమర్శించారు.అయిజ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో ప్రజలు వెంటనే సమస్య పరిష్కారం కోరుతున్నా, అధికారులు మాత్రం పరస్పరం బాధ్యతలు తోసిపుచ్చుకుంటూ కాలయాపన చేస్తున్నారు. డ్రైనేజీలు నిర్మించడంలో నిర్లక్ష్యం, ఉన్న డ్రైనేజీలను శుభ్రం చేయడంలో నిర్లక్ష్యం, దోమల నివారణ చర్యలు చేపట్టాలని, ఆరోగ్య విభాగం అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రజల సమస్యలు తీర్చడంలో విఫలమవుతున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ, “ప్రజల కోసం పోరాడటంలో ఎప్పుడూ వెనక్కి తగ్గం” అని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అయిజ పట్టణ ఉపాధ్యక్షులు బెల్లంకొండ నాగరాజు, ఖుషి, టి.నరసింహులు, విటల్, సునందమ్మ, లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.