Listen to this article

జనం న్యూస్ 03 డిసెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్

చీప్ మినిస్టర్ … చీప్ మాటలు రాజకీయాలు కోసమే హిందు దేవుళ్ళ ఫై చీప్ మాటలు…గతంలో కేసీఆర్ హిందుగాళ్లు ,బొందు గాళ్ళు అన్నందుకు బొంద పెట్టారు.రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలునిన్ను బొంద పెట్టడం ఖాయం.రాష్ట్ర బిజెపి పార్టీ పిలుపుమేరకు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణమ్మ సూచన మేరకు బిజెపి జిల్లా యువ నాయకురాలు డీకే.స్నిగ్ద రెడ్డి ఆదేనుసారం యువ మోర్చా మరియు మహిళ మోర్చా సమత మధు గౌడ్ ఆధ్వర్యంలో హిందూ దేవతలను కించపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి “డౌన్ డౌన్”అంటూ గద్వాల పట్టణం లోని వైయస్సార్ చౌక్ దగ్గర నిరసన వ్యక్తం చేయడం జరిగింది..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు హాజరై మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి మాట్లాడే తీరు చూస్తుంటే ముస్లిం అంటే కాంగ్రెస్- కాంగ్రెస్ అంటే ముస్లిం అనే భావన కలుగుతుందని అన్నారు..సీఎం పదవి ఉడిపోతుందని రాహుల్ గాంధీ మెప్పుకోసం హిందూ దేవుళ్లను అవమాన పరుస్తున్నారని అన్నారు..హిందూ దేవుళ్లను కించపరిస్తే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని అన్నారు..హిందువులకి 3 కోట్ల మంది దేవతలు ఉన్నారా అని మాట్లాడుతూ బ్రహ్మచారులకి హనుమంతుడని, ఇద్దరు భార్యలు ఉన్నోళ్లకు ఇంకో దేవుడని, మందు తాగేటోల్లకు ఒక దేవుడు, ఎల్లమ్మ,పోచమ్మ మైసమ్మ లకు కోడిపుంజునీయాలి అని కించపరిచినందుకుగాను తెలంగాణ ప్రజలు అసలు నువ్వు హిందువేనా లేక నువ్వెందులోకైనా మారిపోయావు అని తెలంగాణ ప్రజలు విస్తుపోతున్నారు ..ఇంకోసారి హిందూ దేవతల పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు గతంలో ఒకడరు హిందుగాలు, బొంధుగాళ్ళు, అన్నందుకు బొంద పెట్టారు.. నీవు కూడా నీ ప్రభుత్వాన్ని కూడా అదే గతి పడుతుంది అని చెప్పి హెచ్చరించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ ఎక్బోటే, శ్యామ్ రావ్,పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ,జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు దాస్,బిజెపి సీనియర్ నాయకులు కన్వీనర్ చిత్తారి కిరణ్,నరసింహ శెట్టి ,బిజెవైఎం నాయకులు పాండు రెడ్డి గాంజ సాయి,ఢిల్లీ వాలా క్రిష్ణ, మోహన్ రెడ్డి, సతీష్ ఎబివిపి ,డబ్బేలేటి నరసింహ, రామకృష్ణ ప్రదీప్ ,సద్దలోని పల్లి నరసింహులు,శంకర్,మహిళ మోర్చా నాయకులు శోభా రాణి ,భారతి తదితరులు ఉన్నారు..