Listen to this article

జనం న్యూస్- డిసెంబర్ 3- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-

నాగార్జునసాగర్ హిల్ కాలనీ పిఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైసింగ్ ఇండియా) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల లో బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిల్లలకు పాటల పోటీలు మరియు వివిధ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరియు వికలాంగుల పట్ల మనకు ఉండాల్సిన బాధ్యతలు అదేవిధంగా వికలాంగులకు ప్రభుత్వం అందిస్తున్న వివిధ రకాల పథకాలు వారిపట్ల సమాజానికి ఉండవలసిన బాధ్యతలు, హక్కులు మొదలైన వాటిపై అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వికలాంగులకు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలు గురించి విద్యార్థులకు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామరాజు వెంకటరమణ మరియు ఉపాధ్యాయులు సతీష్ కుమార్, వెంకన్న ,ప్రసాదరావు ,రేణుక, సంధ్య, విజయ మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మరియు సభ్యులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. అనంతరం విద్యార్థులకు బహుమతులు మరియు మిఠాయిలు పంచి పెట్టడం జరిగింది.