Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఉండకుండా చూసుకోవాలి సీఐ పి రంజిత్ రావు సూచించారు మండలంలోని వివిధ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసే అభ్యర్థితో ముగ్గురికి మించి ఎక్కువ ఉండకూడదు అని అన్నారు ఎన్నికల ప్రచారంలో ర్యాలీలు డీజే సౌండ్ రాత్రి వేళల్లో టు వీలర్ పై ర్యాలీలు పూర్తిగా నిషేధమన్నారు ఎన్నికలు ప్రశాంత జరిగే విధంగా ప్రతి ఒక్కరు సహకరించాలని ఎన్నికల నియమాలకు అందరూ కట్టుబడి ఉండాలని సూచించారు ఎన్నికల నిబంధనలు అతిక్రమి‌స్తే కేసులు నమోదు చేస్తామన్నారు ఎన్నికలు పోటీ చేస్తున్న అభ్యర్థులకు సంబంధించి ఇతర పార్టీల నాయకుల గురించి వాట్సాప్ గ్రూప్ లలో సోషల్ మీడియాలో రెచ్చగొట్టే విధంగా మెసేజ్లు పెట్టకూడదు అని అన్నారు అలా పెట్టినట్టయితే గ్రూపు అడ్మిన్ లపై కూడా కేసు నమోదు చేస్తామని తెలియజేశారు ఆయన వెంట ఎస్సై జక్కుల పరమేశ్వర్ ఏఎస్ఐ కుమారస్వామి పోలీస్ సిబ్బంది ఉన్నారు….