జనం న్యూస్ అల్లాదుర్గ్ మండల్ మెదక్ జిల్లా4/12/2025 గురువారం
అల్లాదుర్గ్ మండల పరిధిలో గల హనుమాన్ ఆలయంలో దత్త జయంతి వేడుకలతో పాటు దాసాంజనేయ స్వామి నాలుగవ వార్షికోత్సవ పూజలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి ప్రత్యేక పూజలతో పాటు హోమ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ పూజారి ఆనంద్ శర్మ మాట్లాడుతూ మార్గశిర శుక్లపక్ష పౌర్ణమి తిధిని దత్త జయంతిగా జరుపుకుంటారని, ఈరోజే దత్తాత్రేయని అవతారం ఉద్భవించిందని కావున మార్గశిర పౌర్ణమిని పవిత్రమైన రోజుగా పరిగణిస్తారని, అత్రి మహాముని, మహా ప్రతివత అయిన అనసూయ దత్తుడిగా, ఈయన త్రిమూర్తుల అయిన బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల అంశతో జన్మించిన వరపుత్రుడని, దత్త స్వరూపాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టుగా విశ్వసిస్తారు అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది, ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



