Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగెద్దనపల్లి శివారు చింతలమెరక గ్రామంలో శ్రీ విజయలక్ష్మి దుర్గ అమ్మవారు ఆలయం లో అమ్మవారికి మార్గశిర మాస పౌర్ణమి సందర్భంగా చింతపల్లి శ్రీమన్నారాయణ వారి కుటుంబ సభ్యులు చే పంచామృత అభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఆలయం పురోహితులు ఆకొండి శ్రీకాంత్ శర్మ వారి ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ ఆలయం వద్ద ప్రతినెల పౌర్ణమి నాడు అభిషేకం జరిపించడం జరుగుతుంది కావున భక్తులు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. కందికుప్ప వాస్తవ్యులు విల్లా శ్రీనివాస్ శ్రీమతి యశోద వారు అమ్మవారికి బంగారపు బొట్టు ,వెండి ముక్కుపుడక సమర్పించారు . ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కముజు లక్ష్మీ రమణారావు , అప్పారి సత్యనారాయణ రిటైర్డ్ ఈ ఈ పంచాయతీ రాజ్ వనచర్ల సూర్య పవన్, బొక్క జగదీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.