Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి

శాయంపేట మండలం పంచాయతీ ఎన్నికల మూడవ విడత నామినేషన్ ప్రక్రియ సజావుగా నిర్వహించాలి రాజకీయ ముసుగులో అలజడలు అరాచకాలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పరకాల ఏసీపీ సతీష్ బాబు అన్నారు అనంతరం ఆయన మండలంలోని ప్రగతి సింగారం శాయంపేట లో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు మండల కేంద్రంలోని నామినేషన్ల తీరును తెలుసుకున్నారు పోలీస్ సిబ్బంది కి పలు సూచనలు తెలిపారు హడావిడి చేయకుండా ప్రశాంత వాతావరణంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేయాలని రాజకీయ నాయకులకు సూచించారు సోషల్ మీడియా పై ప్రత్యేక నీఘా ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరూ సహకరించాలన్నారు ఎన్నికల సమయంలో గొడవలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఏసీపీ వెంట సిఐ పి రంజిత్ రావు ఎస్సై జక్కుల పరమేశ్వర్ పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు….