Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 5 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని అభివృద్ధి చేసి చూపిస్తామని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి కోరారు. శుక్రవారం శాయంపేట మండలంలోని మైలారం గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి తో పెద్దకోడపాక కేంద్రంలో నామినేషన్ వేయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదిస్తే ప్రజా ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని అన్నారు. నిజాయితీ నిబద్దతతో పనిచేసి, అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలలో కూడా మండలానికి అధిక ప్రాధాన్యత నిచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చల్లా చక్రపాణి మామిడిపల్లి సాంబయ్య డిటి రెడ్డి అరికెళ్ల సుధాకర్ ఏనుగుల శిరీష అశోక్ కుమారస్వామి రవీందర్ సదయ్య రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు….