Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 6, వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని

చౌడపూర్ మండలం చాకలి పల్లి గ్రామానికి చెందిన పటేల్ సుధాకర్ కుమార్తె స్వప్నకు గద్వాలలో ఎంబిబిస్ సీటు రావడం జరిగింది.ఆర్థికంగా ఇబ్బందులు ఉండడంతో మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పందించి వైద్య విద్య పూర్తయ్యే వరకు విద్యార్థినికి ఆర్థికంగా అండగా ఉంటామని ప్రతి సంవత్సరం విద్యార్థినికి యూనివర్సిటీ ఫీజు అందజేస్తానని తెలియజేశారు.మొదటి సంవత్సరం ఫీజును 25,000/-విద్యార్థిని తండ్రికి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అందజేయడం జరిగింది.