బిచ్కుంద నవంబర్ 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప స్వాముల పూజా కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు..ఈ సందర్భంగా ఆలయ ఆర్చకులు ఎమ్మెల్యేని శాలువాతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు..అయ్యప్ప స్వామి ఆశీస్సులతో మన ప్రాంతం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని, భక్తుల కోరికలు అన్నీ నెరవేరాలని ఎమ్మెల్యే గారు అభిలాషించారు..అనంతరం అయ్యప్ప స్వాములు ఏర్పాటు చేసిన భిక్షను స్వీకరించారు..




