Listen to this article

జనం న్యూస్ జనవరి 10 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి : కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డి నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ వీరాంజనేయ శివాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయ చైర్మన్ గడ్డం రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వెంకటాచార్యులు పంతులు మరియు గంగాధర్ పంతులు సమక్షంలో శ్రీ బునీల సమేత వెంకటేశ్వర స్వామి వారి పూజలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజలు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఒక్కరు దేవాలయములో పూజలలో పాల్గొనడం వల్ల ఏకాగ్రతను కోల్పోకుండా ఎంతో ప్రశాంతంగా మనస్ఫూర్తిగా ఉంటారని అందుకే ఆధ్యాత్మికతను మరువకూడదని శ్రీధర్ రెడ్డి అన్నారు.ఈ పూజా కార్యక్రమంలో యేసిరెడ్డి భూపాల్ రెడ్డి,చర్ల రామకృష్ణారెడ్డి,ధర్మారావు,సింగిరెడ్డి భూపాల్ రెడ్డి,దశరథ,కర్ల తిరుపతిరెడ్డి,శ్యామల నర్సిరెడ్డి,మహేందర్ రెడ్డి,రాజయ్య శ్రీనివాస్ రెడ్డి,దామోదర్ రెడ్డి,హనుమంతుభాస్కర్ గుప్త,మోహన్ రెడ్డి,కిరణ్,దుర్గా రెడ్డి, సాయి బాబా,రాజీ రెడ్డి,రవి,వెంకన్న మరియు ఇతర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.