విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్
జనం న్యూస్ 07 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
63వ హోంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవం పోలీసు పరేడ్ గ్రౌండులో డిసెంబరు 6న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ ముఖ్య అతిధిగా హాజరై, హోంగార్డ్సు నుండి గౌరవ వందనం స్వీకరించి, పోలీసుశాఖకు, ప్రజలకు హోంగార్డ్పు అందిస్తున్న సేవలను కొనియాడారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ మాట్లాడుతూ – పోలీసు వ్యవస్థలో హెూంగార్డ్సు అంతర్గతంగా ఒక భాగమై పోలీసులు నిర్వహించే అన్ని రకాల విధులును నిర్వహిస్తూ, పోలీసుశాఖలో క్రియాశీలంగా మారారని, పోలీసుశాఖకు హోంగార్డ్సు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివన్నారు. 63సం.లు క్రితం దేశ అంతర్గత భద్రతకు, పోలీసులకు సహాయపడేందుకు స్వచ్ఛందంగా ఏర్పడిన హెూంగార్డ్సు ఎన్నో విధాలుగా అభివృద్ధి చెంది, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుశాఖకు వెన్ను, దన్నుగా నిలుస్తున్నారన్నారు. పోలీసులు నిర్వహించే అన్ని రకాల బందోబస్తులు, ముఖ్య వ్యక్తుల భద్రత, శాంతిభద్రతలు, ట్రాఫిక్ మరియు వివిధ విభాగాల్లో హోంగార్డులు సమర్ధవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. పోలీసు ఉద్యోగుల వలే హోంగార్డ్పు కూడా సాంకేతిక పరిజ్ఞానంను పెంపొందించుకొని, కంప్యూటరు ఆపరేటర్లగా, డ్రైవర్లుగా పని చేస్తున్నారన్నారు. హెూంగార్డులు నీతి, నిజాయితీ, అంకితభావంతో, క్రమశిక్షణతో పని చేసి జిల్లా పోలీసుశాఖకు మంచి పేరును తీసుకొని రావాలని, తద్వారా రాష్ట్ర పోలీసుశాఖకు కూడా మంచి కీర్తిని తీసుకొని వచ్చే విధంగా పని చేయాలన్నారు. హెూంగార్డ్సు సంక్షేమానికి రాష్ట్ర పోలీసుశాఖ కట్టుబడి ఉందన్నారు. జిల్లా పోలీసుశాఖలో పని చేస్తూ, ఉద్యోగ విరమణ చేసినా, మరణించినా వారి కుటుంబానికి అండగా నిలిచేందుకు ఒక్క రోజు వేతనాన్ని అందజేయడం అభినందనీయమన్నారు. హోంగార్డులకి ఏ సమస్య వచ్చిన వాటిని తమ దృష్టికి తీసుకొని వస్తే, పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. హోంగార్డ్సు సంక్షేమంలో భాగంగా కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేసామని, సర్వీసులో ఉంటూ ప్రమాద లేదా అనారోగ్య కారణాలతో మృతి చెందిన హోంగార్డు కుటుంబాలను, ఉద్యోగ విరమణ చేసిన వారిని ఆర్థికంగా ఆదుకొనేందుకు “చేయూత”ను అందిస్తున్నామన్నారు. రాజ్యాంగబద్ధంగా విధులు నిర్వహించి, ప్రజలకు ఉత్తమ సేవలందించాలని, వారికి సహాయకారిగా మెలగాలని హోంగార్డులకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పిలుపునిచ్చారు.అనంతరం, విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన హెూంగార్డ్సుకు, నీట్ టర్నవుట్, పరేడ్ నిర్వహణలో ప్రతిభకనబర్చిన హోంగార్డ్సుకు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ బహుమతులను ప్రధానం చేసారు. హెూంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హెూంగార్డ్సు కవాతు నిర్వహించగా, పరేడ్ కమాండరుగా ఎం.శివ సంతోష్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వి.శ్రీనివాసరావు మాస్టారు వ్యవహరించారు. హెూంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవంకు సూచికగా శాంతి కపోతాలను, బెలూన్సు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత ఎగురవేసారు.హోంగార్డ్సు ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నిర్వహించిన ర్యాలీని పోలీసు కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ పచ్చ జెండాను ఊపి, ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని పోలీసు కార్యాలయం నుండి దిశ పోలీసు స్టేషను వరకు నిర్వహించి, మానవ హారంగా ఏర్పడి, హెూంగార్డ్సు విధులు, సేవలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ డిఎస్పీ ఈ.కోటిరెడ్డి, చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, బొబ్బిలి డిఎస్పీ జి.భవ్యరెడ్డి, ఎస్బీ సిఐ ఎ.వి.లీలారావు, సిఐలు ఆర్.వి.ఆర్.కే.చౌదరి, ఈ.నర్సింహమూర్తి, సిహెచ్. సూరి నాయుడు, బి.లక్ష్మణరావు, టి.శ్రీనివాసరావు, ఆర్ఐలు ఆర్.రమేష్ కుమార్, ఎన్.గోపాల నాయుడు, టి.శ్రీనివాసరావు, డిపిఓ ఎఓ పి.శ్రీనివాసరావు, కార్యాలయ పర్యవేక్షకులు లలిత కుమారి, వెంకటలక్ష్మి, ఆర్ఎస్ఐలు ముబారక్ అలీ, మంగలక్ష్మి, సూర్యనారాయణ, రామకృష్ణ, ఇతర పోలీను అధికారులు, హెూంగార్డ్పు ఇన్చార్జ్ హెచ్సిలు డి.ఎస్.ఎన్. రాజు, కే.శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


