Listen to this article

జనం న్యూస్:3 ఫిబ్రవరి సోమవారం ;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి; సిద్దిపేట పట్టణం బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి భాస్కర్ మరియు పాఠశాల డైరెక్టర్ శ్రీ మల్లిక పాల్గొని వసంత పంచమి యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. సరస్వతి దేవి అనుగ్రహం వల్ల విద్యను బాగా అభ్యసించి భావితరాలకు మంచి పౌరులుగా రూపొందుతారన్నారుప్రిన్సిపల్ భాస్కర్ మాట్లాడుతూ విద్యార్థులకు సరస్వతి దేవి కృపా కటాక్షాలు కలగాలని భోది పాఠశాలలో చదివే విద్యార్థులు మంచి అభివృద్ధి దశలోకి వచ్చి మంచి పౌరులుగా రూపొంది సమాజానికి సేవనందించి వారికి విద్యను బోధించిన ఉపాధ్యాయులకు మరియు వారి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆశించారు .ఈ కార్యక్రమంలో భోగి పాఠశాల ఉపాధ్యాయులు శ్రీలత మౌనిక స్రవంతి ఫర్హీన్ మమత స్వాతి సన రఫత్మ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని వారి యొక్క సంతోషాన్ని వ్యక్తపరిచారు.