ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 7జహీరాబాద్ నియోజకవర్గంలోని పలు
గ్రామాల్లో రైతు సంఘం అధ్యక్షులు మరియు జనరల్ సెక్రెటరీలు ఇండిపెండెంట్లుగా సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ ప్రత్యేకంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిట్టెంపల్లి బాలరాజ్ మాట్లాడుతూ— గ్రామీణ అభివృద్ధి, రైతుల సంక్షేమం, పారదర్శక పాలన కోసం స్వతంత్ర అభ్యర్థులను నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు. రైతుల సమస్యలను ప్రతిపాదించి వాటికి సరైన పరిష్కారాలు అందించేందుకు ఇండిపెండెంట్ అభ్యర్థులు బలంగా ముందుకు వస్తున్నారని చెప్పారు.గ్రామాల అభివృద్ధికి పార్టీలు కాదు, ప్రజల ఆశయాలు ముఖ్యమన్న ఆయన, ప్రజాస్వామ్యంలో రైతుల గొంతుక వినిపించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. నామినేషన్ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు భారీగా హాజరయ్యారు.


