జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
రాజంపేట పట్టణంలోని శ్రీ సరస్వతీ విద్యా మందిరం పాఠశాలలో సప్తశక్తి సంగం పేరున మహిళా సమ్మేళనం జరిగినది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సాయి లక్ష్మి ఏకలవ్య ఫౌండేషన్ అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ వీరు ప్రతి మహిళ ఏడు శక్తులను కలిగి కుటుంబ మరియు దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించగలరని వివరించారు. సీతారామమ్మ భారత దేశ ఉన్నతిలో మహిళల పాత్ర గురించి వివరించారు మహేశ్వరమ్మ కుటుంబ ప్రబోధన గురించి ఉమ్మడి కుటుంబాల ఆవశ్యకత గురించి చెప్పారు. డాక్టర్ ధనశ్రీ పర్యావరణం సంబంధించిన భారతీయ ద్రుష్టి అంశాన్ని మాట్లాడుతూ పిల్లల పట్ల భార్య ఆహార అలవాట్లు పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పారు. ప్రధానాచార్యులు కే గౌరీ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళల పాత్ర గురించి ఇంట్లో విద్యార్థుల పట్ల మన శ్రద్ధ ఎలా ఉండాలని విషయాన్ని వివరించారు



