Listen to this article

సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ డిసెంబర్ 8

జహీరాబాద్ నియోజకవర్గంలోని మొదలైతాండా గ్రామంలో సర్పంచ్ పదవికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీమతి హుబ్లీ భాయ్ పవర్ బరిలోకి దిగారు. గ్రామ అభివృద్ధి, మహిళల సాధికారత, యువతకు ఉపాధి అవకాశాలు, పారదర్శక పాలన తన ప్రధాన లక్ష్యాలుగా ప్రకటించారు.ప్రజల మద్దతుతో విజయం సాధించి గ్రామ అభ్యున్నతికి కృషి చేస్తానని హుబ్లీ భాయ్ పవర్ తెలిపారు. తాను ఎలాంటి పార్టీ ఆధీనంలో కాకుండా, పూర్తిగా ప్రజల ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు కూడా ఆమెకు మంచి ఆశీస్సులు తెలియజేస్తూ ప్రోత్సహిస్తున్నారు.మహిళా శక్తి, ప్రజాసేవ నా ధ్యేయం… సమగ్ర అభివృద్ధి నా లక్ష్యం అని హుబ్లీ భాయ్ పవర్ నినాదం ప్రజల్లో విశేష స్పందన పొందుతోంది.
మొదలైతాండాలో ఎన్నికల వేడి మొదలవడంతో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.