కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ బలపరిచిన వార్డు సభ్యులు
కొత్తగూడెం 08 డిసెంబర్ ( జనం న్యూస్ )
స్థానిక ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం రామాంజనేయకాలనీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వార్డు సభ్యులు పోకల శ్రీలత, దారావత్ మంజు, దారావత్ నాగ ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి డీసీసీ అధ్యక్షురాలు తోట దేవిప్రసన్న, కాంగ్రెస్ నాయకులు జెవిఎస్ చౌదరి, ఆళ్ల మురళి, ఊకంటి గోపాల్ రావు, జేబి శౌరి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీకటి కార్తీక్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు సభ్యులు శ్రీనివాస్ రెడ్డి, సుజాతనగర్ మండల అధ్యక్షులు చింతలపూడి రాజశేఖర్, గౌస్ మొయినుద్దీన్, మరియు తదితరులు పాల్గొన్నారు


