Listen to this article

జనంన్యూస్. 09. సిరికొండ.

నిజామాబాదు రురల్.సిరికొండ మండలంలో మెట్టు మర్రి తాండ గ్రామ పంచాయతీ సిరికొండ మండలంలోనే మొట్టమొదటి ఏకగ్రీవ సర్పంచ్ అభ్యర్థిగా కేతావత్ తిరుపతి నాయక్ ని, ప్రొసీడింగ్ ఆఫీసర్, లత మేడం. ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి ప్రమాణస్వీకారం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం పురస్కరించుకొని సర్పంచ్ తిరుపతి మాట్లాడుతూ నా పై నమ్మకం తో గౌరవ బాధ్యతలు కలిగిన గ్రామ ప్రథమపౌరినిగా ఎన్నుకున్నందుకు మా గ్రామ పంచాయతీ ప్రజలకు మరియు తండా నాయక్, కారోబార్లకు, పెద్దమనుషులకు, వార్డ్ మెంబర్లకు హృదయ పూర్వకంగా అభినదనలు తెలుపుతూ… జిల్లాలో మెట్టు మర్రి తాండ గ్రామ పంచాయతీ ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చి దిద్దుతానని కల్మషం లేకుండా పరిపాలిస్తానని పేరుకొంటూ ప్రమాణస్వీకారం చేయడం అదృష్టంగా బావిస్తున్నననీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువతకు స్వయం ఉపాధి, మహిళా స్వయం సహాయక సంఘ సభ్యులకు వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రభుత్వ పరంగా వివిధ నిధులను సమకూర్చుతానని పేర్కొన్నారు మరియు ఈ కార్యక్రమం లో గ్రామపంచాయతీ కార్యదర్శి నిఖిత, ఉపసర్పంచ్ కేతావత్ గొప్యా, కెతావత్ బద్యనాయక్, మాజీ సర్పంచ్ బాల్ సింగ్, మాజీ ఉపసర్పంచ్ జగన్, వార్డ్ మెంబెర్లూ రాంజీ నాయక్, మున్సింగ్, ప్రకాష్, సుబ్బా, లతా, బుజ్జి, నీలా, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.