జనం న్యూస్ 10 డిసెంబర్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్, ఐపీఎస్ గారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సైబరు సెల్ పోలీసులు గత కొద్ది రోజుల్లో రూ. 26,78,792/- విలువైన 163 పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను ట్రేస్ చేసి, డిసెంబరు 9న బాధితులకు తిరిగి అందజేశారని తెలిపారు. మొబైల్ ట్రాకింగ్‌లో కొత్త విధానం: * ‘మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ను ఏర్పాటు చేశారు. * ఇకపై మొబైల్ పోగొట్టుకున్న బాధితులు నేరుగా విజయనగరం సైబరు సెల్ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండా, దగ్గరలోని పోలీసు స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయవచ్చు. * ఆ స్టేషన్ నుండే ‘మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం’ ద్వారా ట్రాక్ చేసేందుకు చర్యలు తీసుకుంటారు. ఇతర ముఖ్య వివరాలు: * జిల్లాలో ఇప్పటివరకు రూ. 6.23 కోట్లు విలువైన 3,463 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి బాధితులకు అందజేశారు. * ట్రేస్ చేసిన 163 మొబైల్స్‌లో సాంసన్ (17), వివో (50), ఒప్పో (20), రియల్ మీ (25), రెడ్ మీ (19), పోకో (8), వన్ ప్లస్ (4), ఐక్యూ (12), మోటోరోలా (4), ఇనిఫినిక్స్ (2), సథింగ్ (1), నోకియా (1) ఉన్నాయి. * రశీదులు లేకుండా గుర్తు తెలియని వ్యక్తుల నుండి మొబైల్స్ కొనుగోలు చేయవద్దని, దొరికిన మొబైల్స్‌ను స్థానిక పోలీసు స్టేషన్‌కు అప్పగించాలని ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.మొబైల్స్ తిరిగి దక్కించుకున్న బాధితులు సైబర్ సెల్ పోలీసులకు, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సైబరు సెల్ సీఐ శోభన్ బాబు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


