జనం న్యూస్ 10డిసెంబర్ (కొత్తగూడెం నియోజకవర్గం)
శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్. కె సాబీర్ పాష, లకు పంచాయతి ప్రజలకుకృతజ్ఞతలు తెలిపిన సిపిఐ పార్టీ శ్రేణులుసుజాతనగర్ మండల పరిధిలోగల 2 ఇంక్లైన్ గ్రామపంచాయతీ ప్రప్రదంగా ఏర్పడినప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ సభ్యుడిగాఉన్న గుగులోతు నగేష్, ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికై,అనంతరం ఉప సర్పంచ్ గా సింగిరాల రమేష్ లను ఎన్ను కోవటం జరిగినది, ఈ గ్రామపంచాయతీలో 8 మంది వార్డు సభ్యులు ఉంటారు, అందులో ఆరు వార్డులు సిపిఐ గెలవగా రెండు వార్డులు కాంగ్రెస్ గెలుచుకున్నాయి, సిపిఐ మెజారిటీగా ఉన్న 2వ ఇంక్లైన్ గ్రామపంచాయతీ ప్రాంతంలో సిపిఐ నాయకులు తూముల శ్రీనివాస్, మహమ్మద్ అంకుస్, గుగులోతు నగేష్, సింగిరాల రమేష్, ఎప్పటికప్పుడు ఆ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం సహకరిస్తూ ప్రజలకు చేరువగా ఉంటూ 2 ఇంక్లైన్ ప్రాంతంలో అనేక సమస్యలతో పాటు, నీటి సరఫరా సమయపాలన లేక ఇబ్బందులకు గురవుతున్న ప్రజలకు గ్రామపంచాయతీ నిధులతో బోర్లు వేసి ప్రతి ఇంటికి సరిపడా నీరునందించడంలో గ్రామపంచాయతీలకే అగ్రగామిగా మిగిలినది టు ఇంక్లైన్ గ్రామపంచాయతీ. అంతేకాక ప్రతి బస్తిలో సిసి రోడ్లు వేయడం డ్రైనేజ్ సమస్య లేకుండా చేయటం , ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ పరిపుష్టుగా నిర్వహించడం. ఇత్యాది అనేకమైన కార్యక్రమాలు నిర్వహించడంలో సిపిఐ శ్రేణులు గ్రామపంచాయతీని క్రమశిక్షణ పద్ధతి ప్రకారం గా గ్రామ పంచాయతీ ప్రజలకు పూర్తి సహాయ సహకారాలతో నడిపించడానికి నిదర్శనంగా రెండవసారి 2025 డిసెంబర్ ఐదవ తేదీన చేసిన నామినేషన్ లో డిసెంబర్ 9 వ తారీకు ఉపసంహరణ కార్యక్రమంలో సిపిఐ సర్పంచ్ గా మాజీ సర్పంచ్ గుగులోతు నగేష్ సతీమణి అరుణ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం అభినందనీయం, అలాగే గతంలో ఉపసర్పంచిగా చేసిన సింగిరాల రమేష్ కూడా తన నాలుగవ వార్డు నుండి ఏకగ్రీవం కావడం అభినందనీయం, ఒకటవ వార్డు నుండి గడ్డం మురళి, రెండో వార్డ్ నుండి సింగిరాల రేణుక మూడో వార్డు నుండి, బండి శృతి నాలుగో వార్డ్ నుండి సింగిరాల రమేష్, ఐదో వార్డు నుండి ఎల్లబోయినరాములు,ఆరో వార్డు నుండి ఎల్లబోయిన కళావతి, ఏడవ వార్డు నుండి ఈసం రాజమ్మ,ఎనిమిదో వార్డు నుండి గుగులోత్ నగేష్, లుమొత్తం ఎనిమిది వార్డులు సిపిఐ శ్రేణులుఏకగ్రీవం కావడం ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని కమ్యూనిస్టు పార్టీ చూరగొనడమే అందుకు కారణం,2 ఇంక్లైన్ గ్రామపంచాయతీ కమిటీ ఎప్పుడుకొత్తగూడెం శాసనసభ్యులు భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా లకు కృతజ్ఞతగా ఉంటారని ఈ ప్రాంత అభివృద్ధికి వారి పూర్తి సహాయ సహకారాన్ని తీసుకుంటారని నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు, తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని. ప్రజల పరిధిలోవారి సేవలో నిమగ్నమై ఉంటారని హామీ ఇవ్వడం జరిగినది. ఈ నామినేషన్ కార్యక్రమం లో సిపిఐ పార్టీ టౌన్ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు కంచర్ల జమలయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు గనిగండ్ల వీరాస్వామి, రాష్ట్ర సిపిఐ రాష్ట్ర కౌన్సిలింగ్ సభ్యులు సలిగంటిశ్రీనివాస్,జిల్లా సిపిఐ కౌన్సిల్ సభ్యులుమునిగడప వెంకటశ్వర్లు, భూక్యా శ్రీనివాస్ ,రామవరం బ్రాంచి కార్యదర్శి మర్రి గోపి కృష్ణ ప్రజా సంఘాల నిర్మాణ కార్యదర్శి తూముల శ్రీనివాస్ ఆరు డివిజన్ల కార్యదర్శి మండల రాజేశ్వరరావు, రామవరం బ్రాంచ్ సహాయ కార్యదర్శి గుత్తుల శ్రీనివాస్, టౌన్ కార్యవర్గ సభ్యులు 2 ఇంక్లైన్ శాఖ కార్యదర్శి మహమ్మద్ అంకుష్, కొత్తగూడెం మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ అజ్మీరా బాలాజీ నాయక్ ఏఐటీసీ నాయకులు సండెబోయిన శ్రీనివాస్ , సింగిరాల రమేష్, గుగులోత్ నగేష్, సామల విజయ్, వడ్డేపల్లి శ్రీనివాస్,శివ ప్రసాద్ (బచ్చు), సామలసమ్మయ్య,గునిగంటి మల్లేష్, వరప్రసాద్,సింగిరాల శ్రీనివాస్,గడ్డం శ్రీనివాస్, గోరె,అక్బర్,సోప్పరి శశి,చింతల నగేష్,చింతల కళ్యాణ్, గిరీష్, తరుణ్, యస్వంత్.. మహిళ సమైక్య నాయకులు ఎస్.కె షాహిన్ మధ్యల విజయలక్ష్మి ఉమమేశ్వరి, మెహరినిష, విజయ, భాగ్య,సరిత, ఆస్మా పర్వీన్,మరియు తదితర్లు పాల్గొన్నారు,


