జనం న్యూస్, డిసెంబర్ 10 : వేల్పూరు మండలం:
నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని దోంచందా గ్రామ సర్పంచ్ గాపెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి, వార్డు సభ్యులుగా మద్దెల రాజేందర్, వెంకయ్యగారి శ్రీనివాస్ రెడ్డి, నాగిరెడ్డి రవి, గద్దె గంగారాం, ప్యాట లక్ష్మి, సోమిరెడ్డి కావ్యశ్రీ, పెద్దకాపుల లాస్య, పుట్ట చిన్నమ్మ, సుమలత బుధవారం రోజున స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా వారి నివాసంలో కలిశారు.దోంచందా గ్రామ ప్రజల ఏకగ్రీవ విశ్వాసంతో ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు సభ్యులను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం తమ వంతు గా కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఏర్గట్ల మండల అధ్యక్షుడు ఏనుగందుల రాజపూర్ణానందం, స్థానిక నాయకులు శ్రీనివాస్ రెడ్డి, గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు


