Listen to this article

పార్టీ విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి..
▪️కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్..

జనం న్యూస్ //జనవరి 11//జమ్మికుంట //కుమార్ యాదవ్..
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ ని కరీంనగర్లో లోని వారి నివాసంలో కలిసి హుజురాబాద్ నియోజకవర్గం కి ఈజీఎస్ నిధుల కింద కేటాయించిన పనులు కాకుండా మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ మరియు బిజెపి జమ్మికుంట మండలాధ్యక్షుడు సంపెల్లి సంపత్ రావు కోరారు.స్పందించిన కేంద్ర మంత్రివర్యులు రానున్నరోజుల్లో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చెపడతనని,స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం ప్రణాళిక లు చేయాలని అదేవిధంగా స్థానిక సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని అప్పుడే స్థానిక సంస్థలు గెలుపొందే అవకాశం ఉంటుందని అన్నారు. హుజురాబాద్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తానాని తెలిపారు.