Listen to this article

సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ సమస్యలు పరిష్కరిస్తా… జయశీల యాదరావ్

.బిచ్కుంద డిసెంబర్ 11 జనం న్యూస్కా

కామారెడ్డి జిల్లాజుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం పత్లాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జయశీల యాదరావ్ ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ సర్పంచ్ గా నన్ను గెలిపిస్తే మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గ్రామంలో ఉన్న సమస్యలు తనకు తెలుసు అని సర్పంచుగా ఒకసారి గెలిపిస్తే సమస్యలను పరిష్కరిస్తానని, గ్రామంలో ఉన్న విద్య, వైద్యం మెరుగుపరుస్తానని ప్రజలకు హామీ ఇస్తూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. యువకులు, నాయకులు కార్యకర్తలు కష్టపడి పని చేసి జయశీల యాదవ్ రావు 100% గెలిపించుకుంటామని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.