Listen to this article

జనంన్యూస్. 12.నిజామాబాదు.

సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా విస్తృతంగా ప్రచారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ. ఇందూరు జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి కలిసి పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతు “గ్రామ అభివృద్ధి అంటే కేవలం పనులు ప్రారంభించడం మాత్రమే కాదు, ప్రజల అవసరాలను అర్థం చేసుకుని వాటిని సమయానికి అమలు చేయడం ముఖ్యమైంది. సర్పంచ్‌గా ప్రజలతో అందుబాటులో ఉంటూ, గ్రామ అభివృద్ధి పట్ల అంకితభావంతో పనిచేసే నాయకత్వం అవసరం. భారతీయ జనతా పార్టీ బలపరిచిన మా అభ్యర్థులు ఇదే నిబద్ధతతో ముందుకు సాగుతున్న నేతలు.గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు వేదికలు, రేషన్ బియ్యం, స్మశాన వాటికలు, ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, శుద్ధి నీరు, రహదారులు, వెలుగులు, పరిశుభ్రత మొదలగు సంక్షేమ పథకాల పారదర్శక అమలు వంటి అంశాల్లో మా అభ్యర్థులు చక్కటి మార్పు తీసుకురాగలరు. గ్రామ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్న ఈ సమయంలో మా అభ్యర్థులను గెలిపించి గ్రామాలను ముందుకు తీసుకెళ్లాలని మనవి చేస్తున్నాను” అని తెలిపారు.ప్రచార కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోల్ల లక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు ఇల్లేందుల ప్రభాకర్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ, బిజెపి కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.