Listen to this article

జనం న్యూస్ డిసెంబర్ 13 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పనితీరు బాగుందని, వారితో ముందుకు సాగడం మంచి పరిణామని ఉమ్మడి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులతో ఢిల్లీలో అల్పాహారం విందు సందర్భంగా దేశ ప్రధానమంత్రి మోడీ ఈ వ్యాఖ్యలు చేయడం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరుకు గర్వకారణం మని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు ఈరోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలన తీరు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని, పెట్టుబడులు ఎక్కువ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు వెళుతున్నాయని ఇది శుభ పరిణామని రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారని నాగ జగదీష్ అన్నారు. గత ఐదు సంవత్సరాలలో వైసిపి పాలనలో జగన్ రెడ్డి అధోగతి పాలు చేశారని, రాష్ట్రానికి ఎంత నష్టం జరగాలో అంత నష్టాన్ని చేసి ఆర్థిక, సహజ వనరులను లక్షల కోట్లు దుర్వినియోగం చేశారని, దాని ప్రభావాన్ని అధిగమించడానికి శక్తివంతం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రి 30 సార్లు ప్రధానిని, హోం శాఖ మంత్రివర్యులు అమిత్ షా ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారాం, ఇతర కేంద్రం మంత్రులను రాష్ట్రానికి రావలసిన నిధులు, గురించి, కొత్త ప్రతిపాదనల గురించి ఎప్పటికప్పుడే కలుసుకొని చక్కని సమన్వయంతో రాష్ట్రానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడం వల్ల గతంలో నిలిచిపోయిన నిధులు, సంక్షేమ పథకాలను తీసుకురావడంలో ముఖ్యమంత్రి కృషి అభినందనీయమని నాగ జగదీష్ అన్నారు. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వ నిధులు వినియోగములో అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని అధికారులకు ఆదేశించడం దీనిలో భాగమైనని నాగ జగదీష్ అన్నారు.//