బీజేపీ నేత డాక్టర్ ఏలూరి పిలుపు.
జనం న్యూస్ డిసెంబర్ 13 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పీవీఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతున్న “అటల్ – మోదీ సుపరిపాలన యాత్ర” ఈ నెల 15వ తేదీన ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోకి ప్రవేశించనుంది.ఈ సందర్భంగా నిర్వహించనున్న బస్సు యాత్ర కార్యక్రమానికి ప్రజలు, ఎన్డీఏ కూటమి(బీజేపీ, టీడీపీ, జనసేన) నేతలు, కార్యకర్తలు, హింధూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు.ఇప్పటికే పలు జిల్లాల్లో పూర్తి చేసుకున్న బస్సు యాత్ర ద్వారా పీవీఎన్ మాధవ్ గారు.. అటల్ మోదీ సుపరిపాలనను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళుతున్నారని తెలిపారు. ఒంగోలులో జరుగనున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలన్నారు.మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారి వాజపేయీ గారి సుపరిపాలన దృక్పథాన్ని మరింత విస్తృతంగా కొనసాగిస్తూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో వేగంగా ముందుకు సాగుతోందన్నారు. అటల్ – మోదీ ప్రభుత్వాల సంకల్పాలు, ప్రజలకు అందించిన విజయాలను నేరుగా ప్రజల వద్దకు తీసుకెళ్లడమే ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు. అటల్ – మోదీ పాలనలో దేశవ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, గ్రామీణ రోడ్ల నిర్మాణంతో మౌలిక సదుపాయాలు గణనీయంగా మెరుగయ్యాయని చెప్పారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన, భారత్‌మాల, సాగర్‌మాల వంటి పథకాల ద్వారా రవాణా వ్యవస్థ బలోపేతం అయ్యిందన్నారు. అలాగే డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా పరిశ్రమలకు ఊతమిచ్చి, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని వివరించారు. వ్యవసాయ రంగంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, పంటల బీమా పథకం ద్వారా రైతులకు భరోసా కల్పించామని, సామాజిక రంగంలో ఆయుష్మాన్ భారత్, ఉజ్వల, జల జీవన్ మిషన్ వంటి పథకాలతో కోట్లాది మంది పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. దేశ రక్షణ రంగంలో స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇచ్చి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు మరింత విస్తరించాయని తెలిపారు. అభివృద్ధి ప్రతీకగా నిలిచే ఈ అటల్ – మోదీ సుపరిపాలన యాత్రలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రజల మద్దతుతో దేశాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లాలనే సంకల్పంతో ఈ యాత్ర కొనసాగుతోందని ఏపి బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు.


