సీఐ వెంకటరెడ్డి,
జనం న్యూస్,డిసెంబర్ 13,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకట్ రెడ్డి, శనివారం పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉందని అన్నారు.ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ గ్రామాలలో ఉండే ప్రజలు తమ గ్రామాలలో జరుగుతున్న ఎన్నికలను సామరస్యంగా,ఎన్నికల నియమాలను పాటిస్తూ సజావుగా జరుపుకోవాలని అన్నారు.ఎన్నికల కమిషన్ గ్రామాలలోని గతివిధులను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని అన్నారు.ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నవేళ, ఏం చేసినా ఫర్వాలేదులే అన్న ధోరణితో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘనలకు పాల్పడినా కేసులు తప్పవని అన్నారు. ఒక్కసారి కేసు నమోదైతే,అది కొన్నేళ్లపాటు వెంటాడుతూనే ఉంటుందని అన్నారు. నేరం నిరూపితమైతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. గ్రామాల్లో తాగి న్యూసెన్స్ చేసినా, ఎదుటివారిని రెచ్చగొట్టినా,గొడవకు దారితీసిన,ఎదుటి వారి ప్రచారానికి అడ్డు పడిన, లా అండ్ ఆర్డర్ సమస్య ను సృష్టించినా బారి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అన్నారు. గ్రామాలలో సహజంగా మాట్లాడుకునె మాటలు కేసులది ఏముందిలే, అని చాలామంది బాహాటంగానే నిబంధనలను ఉల్లంఘిస్తుంటారు.కేసు నమోదైతే కొన్నేళ్లపాటు న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి ఉంటుందని అన్నారు.సదరు నాయకులు ఎన్నికల్లో పాల్గొన్న ప్రతిసారీ ఈ కేసులను ప్రస్తవించవలసి వస్తుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను పొందాలన్నా,కేసుల ప్రస్తావన తప్పనిసరి, ప్రభుత్వ ఉద్యోగాలు, ముఖ్యంగా పోలీసుశాఖలోకి ఎంపిక కావాలంటే కేసులు కచ్చితంగా అడ్డంకిగా మారుతాయని అన్నారు.పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుంటే ఈ కేసులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటాయని అన్నారు.అందుకే ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించడం అవసరమని అన్నారు.


