జనం న్యూస్ డిసెంబర్ 12 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కాట్రేనికోనలో వేంచేసిన శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారికి మార్గశిర మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా పసుపు కుంకుమ ప్యాకెట్లతో ప్రత్యేక అలంకరణ చేయడం జరిగింది.దీనిలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో తొలత విగ్నేశ్వరుని పూజ, అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అభిషేకం, మరియు సహస్రనామకుంకుమార్చన , ధూప దీప నైవేద్యాలు, నీరాజనం మంత్రపుష్ప కార్యక్రమాలు నిర్వహించారు.అధిక సంఖ్యలో భక్తులు వచ్చి పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో తిలకించి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సాయిబాబా, రామకృష్ణ పరమహంస, గ్రంధి నారాయణమూర్తి,గ్రంధి రాంప్రసాద్, సంసాని పాండురంగారావు, తాతపూడి సుబ్బారావు , పవన్ కుమార్, శ్రీకాంత్, వేదుల శ్రీను, లక్ష్మీ ప్రసన్న, గ్రంధి రాధిక, తటవర్తి వెంకటరత్నం, చెరుకు నాగ శ్రీకృష్ణ, చెరుకు బాపిరాజు, మురళి , సానబోయిన సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.ఆలయం వద్ద 11 గంటల నుండి వచ్చిన భక్తులకు పులిహార ప్రసాదాన్ని వితరణ చేయడం జరిగింది.ఈరోజు ప్రసాదం దాతలు శ్రీనివాస లైటింగ్ అండ్ సౌండ్ సిస్టం, వెంకన్న గారు నడవపల్లి.సాయంత్రం 4 గంటలకు అమ్మవారి ఆలయంలో మహిళలు అంత కలసి లలితా సహస్ర పారాయణం చేసిరి.



