Listen to this article

జనం న్యూస్ -ఫిబ్రవరి 4- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:-నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం వద్ద దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా మహాబోధి సొసైటీ సికింద్రాబాదు మరియు అంతర్జాతీయ త్రిపిటక సంగాయన మండలి సంయుక్తంగా, ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు త్రిపిటక పఠనం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
బౌద్ద ధార్మిక, సాంస్కృతిక, సాంప్రదాయాలను, పరిరక్షించి, కొనసాగించాలన్న ఉద్దేశంతో, 108 మంది బౌద్ధ భిక్షువులతో, నిర్వహించే ఈ పఠన కార్యాక్రమానికి తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోని బుద్ధవనం సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా భాగస్వాములై బుద్ధవచనాన్ని వినే అరుదైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.
ఈ కార్యక్రమం గురించి మరిన్ని వివరాల కోసం చేతన్‌కుమార్‌, మహాబోధి విహార, 72070 72510 మొబైల్‌ నెంబర్‌లో సంప్రదించవచ్చని వారు ఒక ప్రకటనలో తెలిపారు.