

జనం న్యూస్ పిబ్రవరి 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
చింతలమానేపల్లి మండలంలోని లంబడిహెట్టి, రణవెల్లి, చింతలమానేపల్లి, డిమ్డా, గూడెం గ్రామాల్లో దాడులు నిర్వహించి (20) లీటర్ల నాటుసారాయిని, (40) దేశిదారు బాటిళ్లు స్వాధీన పరచుకుని, (3) కేసులు నమోదు చేసి నాటు సారాయి, గంజాయి మరియు మత్తు పదార్ధాల వలన కలిగె దృష్ప్రభావాల గురించి అవగాహన సదస్సు నిర్వహించడమైనది. (5) మంది నేరస్తులని చింతలమానేపల్లి తహశీల్దార్ మునావర్ షరీఫ్ గారి ముందర బైండోవర్ చేసినట్టు కాగజనగర్ ఎక్సైజ్ సీఐ , వి .రవి తెలిపారు. ఈ దాడులలో ఆదిలాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ అక్బర్ హుస్సేన్, ఎస్సైలు ఐ.సురేష్, పి.రాజేశ్వర్ మరియు సిబ్బంది పాల్గొన్నట్టు తేలిపారు.