Listen to this article

దళితరత్న అవార్డు గ్రహీత భవన నిర్మాణ కార్మికులు శాఖ మండల అధ్యక్షులు రేణికుంట్ల సాంబయ్య మాదిగ…జనం న్యూస్ 4 ఫిబ్రవరి 2025
(ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రిపోర్టర్)ఎల్కతుర్తి మండలంలోని దండేపల్లి గ్రామంలో లక్షలడబ్బులు వేల గొంతులు వాల్ పోస్టర్ ఆవిష్కరించిన దళిత రత్న అవార్డు గ్రహీత రేణికుంట్ల సాంబయ్య మాదిగ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా జరిగినటువంటి ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో సుప్రీంకోర్టు ఆమోదం తెలిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నందున హైదరాబాద్ మహానగరంలో ఫిబ్రవరి 7వ తేదీన జరగబోయేటువంటి లక్షల డప్పులు వేల గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండలంలోని ప్రతి గ్రామం నుండి ఇంటికో మనిషి చంకకు ఒక డప్పు వేసుకొని తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి రవి బిఎస్పి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీనివాస్ సన్రైస్ యూత్ అధ్యక్షులు జన్ను మహేష్ జన్ను ఐలయ్య తదితరులు పాల్గొన్నారు..