

డబ్బుసంచులతో వస్తున్న వారిని నిలువరిద్దాం
ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి
-టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై. అశోక్ కుమార్
జనం న్యూస్, ఫిబ్రవరి 5, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )టీచర్ ఉద్యోగంలో ప్రవేశించినప్పటి నుండి రిటైర్డ్ అయ్యేంత వరకు ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేశానని, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి గా గెలిపిస్తే టీచర్ల గొంతుకగా పనిచేస్తానని టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి వై. అశోక్ కుమార్ అన్నారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో ని ప్రెస్ క్లబ్ లో విలేఖరుల సమావేశం జరిగింది.ఈ సందర్బంగా అశోక్ కుమార్, మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులు తమ స్వప్రయోజనాల కోసం డబ్బుసంచులతో వస్తున్నారని,వారిని నిలువరిద్దామన్నారు.ప్రభుత్వ విద్య బలోపేతానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పేదలకు ప్రభుత్వ విద్య దూరమవుతున్న పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు.ధన రాజకీయాలను ఓడించి ఉద్యమ నాయకులను ఎమ్మెల్సీ లు గా ఎన్నుకున్నట్లయితే ప్రభుత్వ విద్య బలోపేతం అవుతుందని అన్నారు. గత 36 సంవత్సరాలుగా నేను పూర్తిగా ఉపాద్యాయ ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిగా మీ ముందుకు వస్తున్నానన్నారు. ఉపాద్యాయ సంక్షేమం, ప్రభుత్వ విద్యా రంగ పటిష్టతకు కృషి చేస్తూ విద్యా వ్యవస్థ పటిష్ఠతకు కృషి చేస్తామని తెలిపారు.రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి,మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రలోబాలకు లొంగ కుండా,ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు అశోక్ కుమార్,ని గెలిపించాలని కోరారు.ఈ సమావేశంలో టీపీటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రాజయ్య,యూ టి ఎఫ్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు వలి అహ్మద్, టిఫిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పాపి రెడ్డి, యూ టి ఎఫ్ జిల్లా కార్యదర్శి రాంచంద్రం, సీనియర్ నాయకులు రాంచంద్రం, రాజులు, జోన్ కన్వీనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.