Listen to this article

జనం న్యూస్. ఫిబ్రవరి 5. సంగారెడ్డి జిల్లా. గుమ్మడిదల. ప్రతినిధి. (అబ్దుల్ రహమాన్)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామంలోని ప్యారానగర్‌లొ ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డ్‌పై స్థానిక ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. డంపింగ్ యార్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ నాయకులు స్థానిక గ్రామస్తులు నిరసన కార్యక్రమం చేపట్టడంతో, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పోలీసులు నల్లవల్లి గ్రామంలో 144 సెక్షన్‌ను అమలు చేశారు.ఈ నేపథ్యంలో, గ్రామస్థులను పరామర్శించేందుకు వెళ్లిన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం కొనసాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. డంపింగ్ యార్డ్ ఏర్పాటు విషయంలో స్థానికుల అభిప్రాయాలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. రైతులు స్థానికుల ఆవేదన ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావడం లేదన్నారు. ప్రజలను నాయకులను అర్ధరాత్రి నుండి అక్రమ అరెస్టులుచేసి పోలీస్ స్టేషన్ లకు తరలిస్తున్నారని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు. నల్లవల్లి మరియు సమీప 10 గ్రామాల ప్రజలతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న సునీత లక్ష్మారెడ్డి ని వారితోపాటు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.