

జనం న్యూస్ 06 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో ఇటీవల ఆరు బయట కూర్చున్న స్థానికులపై దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ మద్యం మత్తులో ఉన్నప్పుడు గొడవ జరిగిందని.. బాధితుల ఫిర్యాదు మేరకు నలుగురిని గుర్తించి మెజిస్ట్రేట్ ముందు హాజరపరిచామన్నారు. కోర్టు వారికి 14 రోజులు రిమాండ్ విధించిందని తెలిపారు.