

జనం న్యూస్ 06 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
డెంకాడ మండలం బేతనాపల్లి గ్రామ శివారులో గంజాయి సేవిస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారంతో ఎస్‌ఐ సన్యాసినాయుడు తమ సిబ్బందితో కలిసి గైడ్ చేయగా..ఐదుగురినీ అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 5 ఫోన్లు, రెండు బైక్ లు, 160 గ్రాముల గంజాయి సీజ్ చేశారు. పట్టుబడ్డ వారిలో ముగ్గురు మైనర్లు ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.