Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 6 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ షాప్ ఎదుట రైతుల నిరసన తమ పంట చేను నాశనానికి కారణమైన పురుగుల మందు ఇచ్చిన తమను పట్టించుకోవడంలేదని మండల కేంద్రంలోని భాస్కర్ ఫర్టిలైజర్ ఎదుట బుధవారం రోజున మండల కేంద్రానికి చెందిన రైతులు చిట్టి రెడ్డి మహేందర్ రెడ్డి దైనంపల్లి కుమారస్వామి నత్తి మహేందర్ నిరసనకు దిగారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వ్యవసాయ భూమిలో మొక్కజొన్న పంట సాగు చేశామని తెలియజేశారు చేనులో గడ్డి బాగా పెరగడంతో మండల కేంద్రంలోని భాస్కర్ ఫర్టిలైజర్ కు వెళ్లినట్లు తెలిపారు గడ్డి నివారణ కోసం ఓ కంపెనీ కి చెందిన పురుగుల మందును భాస్కర్ ఫర్టిలైజర్ యజమాని సర్వేశం ఇచ్చినట్లు తెలిపారు పురుగుల మందుకు మొక్కజొన్న చేనులో పిచికారి చేయగా మొక్కజొన్న పంట సైతం దెబ్బతినడంతో ఫర్టిలైజర్ షాపు యజమాని సర్వేశం ను ప్రశ్నించినట్లు తెలియజేశారు అతడు పంట చేను ను పరిశీలించి కంపెనీకి తెలియపరిచాడని అన్నారు కంపెనీ సిబ్బంది కూడా పంటను పరిశీలించి తమకు న్యాయం చేస్తామని చెప్పి ఇప్పటివరకు స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనితో సంఘటన స్థలాన్ని కి ఎస్సై జక్కుల పరమేష్ చేరుకొని రైతులతో వెళ్లి పంటను పరిశీలించారు రైతులకు తగిన న్యాయం చేస్తామని ఎస్సై హామీ ఇచ్చారు ఈ మేరకు రైతులు ఆందోళన విరమించుకున్నారు….