Listen to this article

దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో

జనం న్యూస్ 7 ఫిబ్రవరి 2025 (ఎల్కతుర్తి మండల్ బండి కుమార్ స్వామి రిపోర్టర్) ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి వేడుకల కార్యక్రమం దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు రేణుకుంట్ల సాంబయ్య మాట్లాడుతూ అంటరాని తనము నిర్మూలన కొరకు తన భర్త అంబేద్కర్ తో కలిసి ఉద్యమ పోరాటాల్లో పాల్గొని తన భర్త అంబేద్కర్. పైచదువుల కొరకు ఇంగ్లాండు కు వెళ్లినప్పుడు తన స్వగ్రామమైన అంబేద్కర్ వాడలో పశువుల పేడను ఏరి పిడకలు చేసి అమ్మి తన భర్తకు డబ్బులు పంపించేవారు ఆమె సహకారంతో త్యాగంతో తాను ఉన్నత శిఖరాలకు చేరినాను అని అంబేద్కర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మసమాజ్ పార్టీ జిల్లా కార్యదర్శి బొంకూరి రాజు, మారుపాక రవీందర్, మేకల చేరాలు, కృష్ణాకర్, కొయ్యడ సునీత, రేణుకుంట్ల స్వామి, శనిగరపు వెంకటేష్, సుమన్, సర్కార్, సంతోష్, చొక్కం రాజు, ఎర్ర ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.